రోశయ్యపై టీడీపీ నేత తీవ్ర ఆరోపణలు

Dhulli palla Narendra

Advertisements

&NewLine;<p>పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్యపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు&period; కిలారు తన నియోజకవర్గాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని మండిపడ్డారు&period; కౌలుకు తీసుకొని&comma; ఎకరాకి రూ&period;30 వేలు ఖర్చు పెట్టి వేసిన పంట కళ్ల ముందు ఎండిపోతుంటే రైతుల కోసం ఏమీ చేయడంలేదంటూ విమర్శించారు&period; ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఏమీ చేయలేరని&comma; ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు&period; కిలారు వెంకట్రావు పొన్నూరు నియోజకవర్గాన్ని ఏటీఎం అనుకుంటున్నారని దుయ్యబట్టారు&period; ఎమ్మెల్యే పదవిని&comma; నియోజకవర్గాన్ని ఆయన ఎనీటైమ్ మనీగా మార్చుకున్నారని అన్నారు&period; నియోజకవర్గాన్ని పాడి గేదె లాగా మార్చారని వ్యంగ్యస్త్రాలు సంధించారు&period; డబ్బులు దండుకోవడం తప్పితే ప్రజల బాధలు ఆయనకు పట్టవని వ్యాఖ్యానించారు&period; ప్రజల బాధలు కలెక్టర్‌కు పట్టవని&comma; ముఖ్యమంత్రి కూడా పట్టవని ఆరోపించారు&period; టీడీపీ హయంలో ఈ ప్రాంతంలో పంటలను కాపాడడానికి రూ&period;53 కోట్లతో ఆరు లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేశామని అన్నారు&period; కానీ నేడు ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పనిచేయడం లేదని పేర్కొన్నారు&period; అధికారం ఇస్తే రైతు సమస్యలు పరిష్కారం చేయకపోగా&comma; వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకునేందుకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.

పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.

అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.