షిరిడి నాధుడు సాయిబాబా విజయదశమి రోజున మహాసమాధి చెందారు. విజయదశమి రోజున సాయి మహాసమాధి చెందే ముందు కొన్ని సూచనలు ఇచ్చారు. శరీరాన్ని వదిలటానికి కొన్ని రోజుల ముందు వజే అనే ఆయన చేత బాబా రామ విజయం అనే గ్రంధాన్ని చదివించు కున్నారు. శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించిన సారాంశమే ఈ రామ విజయం. మొట్టమొదట వజే ఏడు రోజుల్లో రామ విజయం పారాయణం పూర్తి చేశాడు బాబా వారికి మళ్లీ శ్రీరాముడి కధ వినాలన్పించింది. వజే అనే అతనిని మళ్లీ రెండోసారి చదవమన్నాడు వజే రాత్రి పగలు చదివి మూడురోజుల్లో రెండవ పారాయణం పూర్తి చేస్తాడు వజే. బాబా వారికి మళ్లీ మళ్లి శ్రీరాముడి కధ వినాలన్పించింది, మరల బాబా అతనిని మూడోసారి చదవమంటారు. తాను మూడు రోజులు చదివి అలసిపోతాడు, అప్పుడు బాబా గారు అతనికి సెల విచ్చి పంపుతారు. ఎవరైనా శరీరాన్ని వదిలేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారి వారి మత గ్రంధాలు చదవడం ఆనవాయితి. అలానే పరీక్షిత్ మహారాజుకు ముని కుమారుడు శృంగి శాపం వలన తక్షకుడి ద్వారా మరణం తప్పదని తెల్సినప్పుడు శుక బ్రహ్మ ఏడురోజులలో పరీక్షిత్ కు భాగవతం చెప్పి ఆయనను అనుగ్రహించాడు. బాబా పరమాత్మ అయినా సంప్రదాయాన్ని అనుసరించి రామవిజయ పారాయణ చేయించారు. బాబా చివరిక్షణం వరకు అనేక సలహాలు ఇస్తూ ధైర్యం చెప్పారు. దేహం పడిపోటానికి రెండు మూడు రోజుల ముందు భిక్షకు వెళ్లడం మానేశారు. కాకా సాహెబు దీక్షిత్ మరియు శ్రీమాన్ బూటీగారు ద్వారకామాయిలోనే భోజనం చేసేవారు. 1918 అక్టోబర్ 15 వతేది నాడు బాబా వారిని వాడా కు వెళ్లి భోజనం చేయమని ఆజ్ఞాపిస్తారు. అక్కడ ఇంకా లక్ష్మి బాయి, భాగోజి షిండే, భయ్యాజీ, బాలా షిమ్పే మరియు నానాసాహెబ్ నిమోన్కర్, శ్యామా ఉంటారు. లక్ష్మి బాయికి తొమ్మిది నాణాలు ఇచ్చిన తరువాత బాబా ఇలా అంటారు మసీదులో తనకు బాగాలేదని, తనను రాతితో కట్టిన బూటీ మేడలోకి తీసుకు పోయిన బాగుండునని చెప్పారు. ఇలా అంటూ భయ్యాజీ మీదకు ఒరిగి ప్రాణములను విడుస్తారు. భాగోజి ఈ విషయం నిమోన్కర్కు చెప్పగా, ఆయన బాబా నోటిలో కొంచెం నీరు పోస్తే అది కాస్తా బయటకు కారిపోతుంది. అప్పుడు నిమోన్కర్కు దేవా! అంటూ ఆర్తితో పిలవగా బాబా మెల్లగా “ఆ” అని కల్లుతెరచి చూసి ఇక తరువాత తమ భౌతిక శరీరం వదిలివేస్తారు. బాబా మహాసమాధికి కొన్ని రోజుల ముందు బాబా ఎప్పుడు తన దగ్గరే ఉంచుకొని అపురూపంగా చూసుకునే ఇటకరాయి రెండు ముక్కలు అవుతుంది. మసీదును శుభ్రపరిచే ఒక పనికుర్రవాడు పొరపాటున ఆ ఇటకరాయిని శుభ్రం చేస్తూ క్రింద పడవేస్తాడు. అప్పుడు అది రెండు ముక్కలు అవుతుంది. బాబా వచ్చి ఈ విషయం తెలుసుకొని ఇది ఇటుక కాదు. నా అదృష్టమే ముక్కలు అయి పోయినది. అది నా జీవితపు తోడూనీడ. దాని సహాయం వలననే నేను నిత్యం ఆత్మానుసంధానము చేసేవాడిని. ఈ రోజు అది నన్ను విడిచినది అని అన్నారు. ఈ ఇటుకపై బాబాకు ఇంత ప్రేమా అని మనకి సందేహంకలుగవచ్చు. కాని దీని విషయం బాబాకే తెలియాలి. వారు సుద్ద చైతన్యులు. వారికి ఈ అశాశ్వతమైన వాటి మీద మమకారం ఉండదు. ఈ ఇటుక గురు భక్తికి ప్రతీకగా కొందరు చెప్తారు. ఇక అప్పటికే షిర్డీ అంతా బాబా మహాసమాధి చెందిన వార్త తెలిసి ప్రజలు అందరు అక్కడకు వస్తారు. వారందరిలో తరువాత జరుగవల్సిన కార్యక్రమం పై చర్చలు జరిగాయి. ఎలా సమాధి చేయాలి అనే అంశం మీద చర్చ జరిగింది. ముస్లిం భక్తులు బాబా శరీరాన్ని ఆరుబయట సమాధి చేసి గోరి కట్టాలి అని నిర్ణయించారు. కాని రామచంద్ర పాటిల్ మిగిలిన గ్రామస్థు లందరితో కలిసి బాబావారిని వారు కోరిన విధంగా బూటీ వాడాలో ఉంచాలి అని తీర్మానించారు. ఈ రెండు వాదనల ఎటు తేలకపొతే అందరిలో కలవరపడ్డారు. అప్పుడు కొందరు అధికారులు వచ్చి ఈ విషయమై ఎన్నిక జరగాలి అని నిశ్చయించితే ఎక్కువ ఓట్లు బాబా కోరిన దాన్నే బలపరుస్తాయి. అప్పుడు బూటీ వాడాలో ఎక్కడైతే మురళీధరుని ఉంచాలి అనుకున్నారో అదే స్థానంలో బాబా శరీరాన్ని ఉంచుతారు. ఇక్కడ నిమోన్కర్కు గారు ఆశ్ఛర్యకరమైన విషయం చెప్పారు. బాబా శరీరం 36 గంటల తరువాత కూడా ఏమి పాడవకుండా ఉంది. ఆయన కఫినీని చింపకుండా తీయగలిగారు. బాలాసాహెబ్ భాటే, ఉపాసినీ బాబా కలిసి జరగవలిసిన కార్యక్రమాలు దగ్గర ఉండి పూర్తి చేశారు. జీవన్ముక్తు లైనవారికి ప్రాపంచిక పరంగా అందరి లాగా భౌతికమైన ఆలంబన ఉండదు. కాని అందరి లాగా వారు ప్రవర్తించవచ్చు. బాబావున్నప్పటి నుంచి షిరిడిలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించేవారు.
విజయదశమి నాడు మనం షిరిడి సాయిబాబాను ఎందుకు స్మరించాలంటే
79
previous post