విశాఖలో భారీ డెవలప్‌మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

Advertisements

<p>విశాఖ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది&period; ఐటీ దిగ్గజ కంపెనీ క్యాప్‌ జెమినీ సీఈవో ఐమాన్‌ ఇజ్జత్‌తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్&period;&period;విశాఖలో భారీ డెవలప్‌మెంట్ సెంటర్&comma; గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు&period; సీఎం చంద్రబాబు నేతృత్వంలో &period;&period;విశాఖపట్నం ఇప్పటికే డేటా సెంటర్ హబ్‌గా మారుతోందని వారికి వివరించారు లోకేష్‌&period; దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలోనే విశాఖలో ప్రారంభం కానున్నాయని తెలిపిన మంత్రి&&num;8230&semi;ఇప్పటికే TCS&comma; కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని గుర్తుచేశారు&period; మరో మూడు నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండటం ఐటీ ఎకో సిస్టమ్‌కు మరింత బలాన్నిస్తుందని వెల్లడించారు&period; విశాఖలో కనీసం 20 వేల మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్&comma; క్లౌడ్ సర్వీసెస్&comma; బీపీఎం వర్టికల్స్‌ను ఏర్పాటు చేయాలని కోరారు&period; వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించారు&period;<&sol;p>&NewLine;<p>మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారు ఐమాన్ ఇజ్జత్&period; 1967లో పారిస్ కేంద్రంగా ప్రారంభమైన తమ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3&period;4 లక్షల మంది ఉద్యోగుల్లో&comma; దాదాపు 2 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారని వెల్లడించారాయన&period; ప్రస్తుతం హైదరాబాద్&comma; చెన్నై సహా 13 భారతీయ నగరాల్లో క్యాప్ జెమినీ కార్యకలాపాలు సాగిస్తోందని&comma; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను తాము నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.