తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది.

Advertisements

<p>తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది&period; పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఇవాళ తుది తీర్పును వెలువరిచింది&period; ఈ కేసు విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు&period; ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై స్పీకర్ ఇప్పటికే విచారణ జరిపి&comma; తగిన నిర్ణయం తీసుకున్నారని ఆయన కోర్టుకు వెల్లడించారు&period; ఈ మేరకు పిటిషన్లను స్పీకర్ కార్యాలయం పరిష్కరించిందని ధర్మాసనానికి వివరించారు&period; అయితే&comma; అభిషేక్ మను సింఘ్వీ వాదనలతో జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది&period; స్పీకర్ ఇప్పటికే ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకున్నందున&comma; ఇక ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని భావించిన కోర్టు విచారణ ముగిసినట్లేనని ప్రకటించింది&period; అదేవిధంగా 2 రోజుల్లో స్పీకర్ తన తీర్పు కాపీలు ఫిర్యాదుదారులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..