116
విజయనగరం జిల్లా దత్తిరాజేరు పిహెచ్సీలో కాలం చెల్లిన మందులు కలకలం రేపాయి. మీడియా సమాచారంతో అక్కడకు చేరుకున్న వైద్యాధికారి ఆనంద్ వ్యాక్సిన్ నిల్వలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో కాలం చెల్లిన 14 ఎంఆర్ వ్యాక్సిన్ లను వైద్యాదికారి గుర్తించారు. పెదకాద గ్రామానికి చెందిన చిన్నారికి కాలం చెల్లిన వ్యాక్సిన్ వేసినట్లుగా గుర్తించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.