శ్రీకాకుళం: మెలియాపుట్టి రాజయోగి గ్రానైట్ క్వారీలో ప్రమాదం..

Advertisements

<p>శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలో గ్రానైట్ క్వారీలు మృత్యుకూపాలుగా మారుతున్నాయి&period; పట్టపురం గ్రామ సమీపంలో ఉన్న రాజయోగి గ్రానైట్ క్వారీలో మరో ఘోరం జరిగింది&period; భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం&comma; అధికారుల పర్యవేక్షణ లోపంతో తాజాగా మరో కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు&period; గతంలోనూ ఇద్దరు కార్మికులు మృతి చెందినప్పటికీ&comma; అధికారులు యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ క్వారీని యధేచ్ఛగా నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి&period; నిబంధనల ప్రకారం క్వారీల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉన్నా&comma; యాజమాన్యం అవేవీ పట్టించుకోకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది&period;<br &sol;>&NewLine;తాజాగా&period;&period; అర్ధరాత్రి వరకు వైర్సా కటింగ్ పనులు నిర్వహిస్తుండగా&period;&period; రాజస్థాన్‌కు చెందిన ఆపరేటర్ ధర్మారామ్ జట్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు&period;గతంలో ఇక్కడ ఇద్దరు కార్మికులు చనిపోయినప్పుడు &&num;8216&semi;పిడుగుపాటు&&num;8217&semi; అంటూ బుకాయించి కేసును యాజమాన్యం క్లోజ్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి&period;&period; మైనింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడం వల్లే ఈ అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు&period; పక్క రాష్ట్రాలైన ఒడిశా&comma; రాజస్థాన్ నుండి వచ్చిన వలస కార్మికులు కావడంతో&comma; వారి మరణ వార్త కుటుంబ సభ్యులకు చేరుతుందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది&period; భారీ నష్టపరిహారం ఇస్తున్నామని అధికారులు&comma; యాజమాన్యం చెబుతున్నా&period;&period; క్షేత్రస్థాయిలో అది నిజం కాదని తెలుస్తోంది&period; ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రాజయోగి క్వారీపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.