తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్య మంత్రిని విమర్శించే స్థాయి టిడిపి జనసేన నాయకులకు లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి స్థానిక టిడిపి మాజీ ఎమ్మెల్యే హేమలత జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ లు ఇరువురు నోరు అదుపులో పెట్టుకుని ముఖ్యమంత్రి గురించి అవాకులు చవాకులు పేలితే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందంటూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక మండల పరిధిలోని పెద్ది ఈటిపాకం పంచాయతీలో జగనన్నే మళ్లీ సీఎం కావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి విద్యాదేవన వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూలు అభివృద్ధి ఆసరా చేయూత రైతులకు వడ్డీలు లేని రుణాలు ఇలా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందిస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల నిధుల్ని ముఖ్యమంత్రి జగనన్న బటన్ నొక్కి నేరుగా అర్హులైన వారి ఖాతాల్లోకి వేస్తున్నారంటూ ఆయన అన్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి కూడా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అన్నారు. గత తెలుగుదేశం పార్టీ హయంలో సత్యవేడు అభివృద్ధికి ఏమి చేశారో టిడిపి నాయకులు బహిరంగ చర్చకు రావాలంటూ ఆయన డిమాండ్ చేశారు. టిడిపి పార్టీ శ్రేణులకు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సీఎం జగనన్నను సైకో అంటూ విమర్శలు చేయడం తప్ప ఇంకేమీ చేతకావంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు 2024 ఎన్నికల్లో ప్రజల అండదండలతో భారీ మెజార్టీ గెలుస్తారని ఆయనే మళ్లీ సీఎం అవుతారంటూ ఆయన పేర్కొన్నారు.
సీఎంను విమర్శించే స్థాయి టిడిపి జనసేనకు లేదు..
124
previous post