106
సమాజం కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసుల సేవ మరువలేనిదని మంచిర్యాల్ డిసిపి సుదీర్ కొకైన్ అన్నారు. మంచిర్యాల్ జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ ఆవరణ లో ఆమరవీరుల స్థూపం వద్ద సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ అమరవీరులకు డిసిపి సుదీర్ కొకైన్, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య నివాళులర్పించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం చేశారు. డీసీపీ మాట్లాడుతూ.. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది పోలీసులే కృషేనని అన్నారు. మావోయిస్టులు, సంఘ విద్రోహులతో పోరాడుతూ పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారని అన్నారు. సమాజం కోసం ప్రాణ త్యాగం చేసినవారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.