139
ఆర్టీసీ డ్రైవర్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు, నకిలీ బంగారు, నోట్లు మార్పిడి గ్యాంగ్ లీడర్ దేవరకొండ సుధీర్ నివాసంలో పోలీసుల తనిఖీలు చేపట్టారు. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ నివాసంలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. దేవరకొండ సుధీర్ నివాసానికి భారీ సంఖ్యలో పోలీసు వాహనాలలో వచ్చి తనిఖీలు చేస్తూ,వివరాలను ఆరా తీశారు. గ్యాంగ్ లీడర్ సుధీర్ కూడా పోలీసులు వెంట ఉన్నట్టు సమాచారం.