హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు

isreal - Hamas

Advertisements

&NewLine;<p>ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ ఇటీవలే మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే&period; దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ సైతం హమాస్‌పై ఎదురుదాడికి దిగింది&period; గాజా లోని హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు కొనసాగిస్తోంది&period; ఈ దాడుల కారణంగా హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న 50 మంది ప్రాణాలు కోల్పోయారు&period; ఈ విషయాన్ని హమాస్‌ తాజాగా వెల్లడించింది&period; అక్టోబర్‌ 7à°¨ ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగిన హమాస్‌ మిలిటెంట్లు&period;&period; వందల మంది ప్రజలను బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే&period; సుమారు 224 మందిని బందీలుగా చేసుకుంది&period; వీరిలో ఇజ్రాయెల్‌ పౌరులతోపాటు ఇతర దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు&period; అందులో ఇద్దరు ఇజ్రాయెల్‌ మహిళలతోపాటు ఇద్దరు అమెరికన్లను మానవతా కోణంలో హమాస్‌ విడుదల చేసింది&period; కాగా&comma; తాజాగా ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు హమాస్‌ ప్రకటించింది&period; ఇక ఇజ్రాయెల్‌ దాడులతో గాజా గజగజ వణుకుతోంది&period; హమాస్‌ స్తావరాలే లక్ష్యంగా వైమానిక&comma; భూతల దాడులకు పాల్పడుతోంది&period; ఈ దాడుల్లో సుమారు 7 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది&period; గురువారం ఉత్తర గాజాలో హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా భూతల దాడులు చేపట్టింది&period; సుమారు 250 మంది స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

ఇరాన్ లక్ష్యంగా మరోసారి ట్రంప్ వార్నింగ్.

అమెరికా కాలిఫోర్నియా బీచ్‍లో విషాదం.