103
కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఈసుగాం సమీపంలో పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు యాబై వేలు విలువ చేసే 1.4 కిలోల గంజాయి పట్టుపడినట్టు పోలీసులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన రెండు ద్విచెక్ర్ వాహనాలను తనిఖీ చెయ్యగా వారి వద్దనున్న బ్యాగుల్లో గంజాయి పట్టుపడినట్లు తెలిపారు. మహారాష్ట్ర నుంచి కోనుగోలు చేసి ఇక్కడ విక్రయించేందుకు తీసుకు వచ్చినట్టు యువకులు తెలిపారని అన్నారు. ఈ మేరకు రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి ముగ్గురి పై కేసు నమోదు చేసినట్టు ఈసుగాం పోలీసులు తెలిపారు. కాగా పట్టుపడిన యువకులు ముగ్గురు కూడా మైనర్ లే అని పోలీసులు పేర్కొన్నారు.