నంద్యాల జిల్లా డోన్ లో 03.04.2024 మధ్యాహ్నం డోన్ టౌన్ శ్రీ రామ నగరం నాయకల్లు భరత్ చంద్ర, బోయ ఉదయ్ ఇద్దరు పత్తికొండ ఏరియాలో ఒక వ్యక్తి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి డోనులో అమ్ముకోడం కొరకు ఇద్దరు పంచుకుంటుండగా పోలీసులకు సమాచారం రావడంతో 1100 గ్రాములు గంజాయి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలియజేయడమేమనగా ఎక్కువ శాతం యువతనే గంజాయి తీసుకుంటున్నారు. కాబట్టి వారి తల్లిదండ్రులు వారి పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని డోన్ సీఐ తెలిపారు. వీరి దగ్గర నుంచి ఎవరు అమ్ముతున్నారు. అన్నా విషయంపై విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.
Ganjayi
ఇద్దరు మహిళలతో పాటు గంజాయి ని స్వాధీనం చేసుకున్న SOT పోలీసులు. పరారీలో ప్రధాన నిందితుడు. మంగళవారం ఛత్రినాక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పుగూడ భయ్యా లాల్ నగర్ లో నివసించే పద్మ కుమారుడు శ్రీనివాస్ చారి చెడు సవాసాలకు బానిస కావడంతో కొన్నాళ్ల క్రితం తలిదండ్రులు శ్రీనివాస్ చారి ని ఇంట్లో నుంచి బయటకు పంపించారు. ఈ క్రమంలో శ్రీనివాస్ చారి సంతోష్ నగర్లో ఓ అపార్ట్మెంట్ తీసుకుని ఉంటున్నాడు. తరుచూ ఆంద్రప్రదేశ్ మచిలీపట్నం వెళ్లి వచ్చే వాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఆశ తో గంజాయి దందాలో దిగాడు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి హైదరాబాద్ తీసుకువచ్చి యువతను టార్గెట్ చేసి విక్రయిస్తున్నాడు.
ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం గంజాయి కావాలని శ్రీనివాస్ కు పరిచయం ఉన్న ఓ స్నేహితుడు కోరడంతో పాతబస్తీలో భయ్యా లాల్ నగర్ లో ఉండే తలిదండ్రుల ఇంటికి రావాల్సిందిగా స్నేహితుడికి శ్రీనివాస్ చారి సూచించాడు. అనంతరం 14 కేజీల గంజాయి తీసుకుని భయ్యా లాల్ నగర్ లో ఇంటికి శ్రీనివాస్ చారి చేరుకున్నాడు. ఇంట్లో గంజాయి పెట్టి మాట్లాడగా ఓ వ్యక్తి SOT పోలీసులకు విశ్వసనీ సమాచారం అందించాడు. వెంటనే శంషాబాద్ SOT పోలీసులు ఇంటిపై దాడి చేసి గంజాయి పట్టుకున్నారు. పోలీసుల రాకను గమనించిన శ్రీనివాస్ చారి ఇంటిపై నుంచి కిందకు దూకి పారిపోయాడు. శ్రీనివాస్ చారికి ఆశ్రయం ఇచ్చిన తల్లి తో పాటు మరో యువతిని అదుపులోకి తీసుకుకుని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు.
ఇది చదవండి: పింఛన్ల నిలిపివేతపై టీడీపీపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి మండలంలో కాజా టోల్గేట్ వద్ద అనుమానంతో రెండు వాహనాలను తనిఖీ చేయగా అందులో 80 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 20 లక్షలు. నలుగురు యువకులను అదుపులో తీసుకున్నారు. ఇద్దరు పరారయ్యారు. ముద్దాయిలు తిరుపతి జిల్లాకు చెందిన వారని, విశాఖ నుంచి తిరుపతికి తరలిస్తున్నట్లు ఎస్సీబీ అధికారులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామంలో నిన్న అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటనలో స్థానికంగా నివసించే హజ్జు అనే యువకుని పై అదే గ్రామానికి చెందిన బాలరాజు గంజాయి మత్తులో దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో తీవ్రంగా గాయాలు కాగా అతని కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలు అనునిత్యం రుద్రారం గ్రామంలో జరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. దీనిపై స్థానిక నేతలు, పోలీస్ వ్యవస్థ చర్యలు చేపట్టకపోవడంతో గ్రామంలో గంజాయి సేవించే యువకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Read Also..
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం.. గంగవరం పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడ్డతీగల సీఐ వై రాంబాబు మాట్లాడుతూ.. అడ్డతీగల నుండి రాజమండ్రి వైపు అక్రమంగా ట్రాక్టర్లో తరలిస్తున్న 320 కిలోల గంజాయిని, 5గురు వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నట్లు సిఐ y.రాంబాబు తెలిపారు. ఒక ద్విచక్ర వాహనంతో పైలట్‌గా వెళుతూ ట్రాక్టర్లో రవాణా సాగిస్తున్నారని గంగవరం ఎస్సై రామకృష్ణకు అందిన విశ్వనీయ సమాచారం మేరకు గంగవరం శివారులో వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా ట్రాక్టర్ పై అనుమానం రావడంతో తనిఖీ చేయగా గంజాయి బస్తాలను, ఐదుగురు వ్యక్తులను అదుపులోనికి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. జి జిఅన్న (పైలట్‌గా ), పెద్దింట్ల తిరుమలరావు ( డ్రైవర్), మండోది గణేష్, దళాయి రాజు, ముర్ల బాలరాజు అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
అల్లూరి జిల్లా.. వాహనాలు తనీఖీ లో భాగంగా అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు కిలోల 227 గ్రాముల లిక్విడ్ గంజాయిని, 23 లక్షల 50 వేల రూపాయలు నగదును, ఓలంగి రాజారావు అనే వ్యక్తిని పట్టుకొవడం జరిగింది. ఇతను జి మాడుగుల మండలం అలగాం గ్రామంనకు చెందినవాడు. ఓలంగి రాజారావు చాలా రోజుల నుంచి ఈ లిక్విడ్ గంజాయి వ్యాపారానికి అలవాటు పడ్డాడు. రెండు మూడు సంవత్సరాల క్రితం తమిళనాడు నుండి కొంతమంది వచ్చి లిక్విడ్ గంజాయి తయారు చేయడం నెర్పారు. అక్కడ నుండి లిక్వడ్ తయారుచేసే మిషన్ తీసుకురావడం జరిగింది. చుట్టుపక్కల ఒరిస్సా ప్రాంతాము నుండి గంజాయి సేకరించి లిక్విడ్ గంజాయి తయారు చేయడం నేర్చుకున్నాడు. ఇతను దగ్గర నుండి లిక్విడ్ గంజాయి, 23లక్షల 50 వేలు నగదు, వెయింగి మిషన్, లిక్విడ్ తయారుచేసే మిషను, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నాము.
Read Also..
కుత్బుల్లాపూర్.. శామీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి లో భారీ గంజాయి తరలిస్తున్న ఆరుగురు సభ్యులముఠా ను మేడ్చల్ ఎస్ ఓ టి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒరిస్సా నుండి పుణె వయా హైదరాబాద్ మీదుగా రెండు (కార్లు)వాహనాల్లో తరలిస్తున్న 272 కేజీల గంజాయి ని శామీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఔటర్ రింగ్ రోడ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 2 కార్లు, 7 సెల్ ఫోన్లు, స్వాధీన పరచుకుని రిమాండ్ కు తరలించామని, పెట్ బషీరాబాద్ లోని డీసీపీ కార్యాలయంలో మేడ్చల్ జోన్ డీసీపీ శబరీష్ వివరాలు వెల్లడించారు. పట్టుకున్న సొత్తు విలువ సుమారు 80 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిది లో బాల నగర్ ఎస్ ఓ టి పోలీసులు భారీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డిసియం లో నర్సరీ మొక్కల కింద కోటి రూపాయల విలువ గల 400 కేజీల ఎండు గంజాయి రాజమండ్రి నుండి మహారాష్ర్ట కు రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని(1) బబ్లూ ఖారే, ( 2) గోవింద్ పాటిధర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక డిసియం వాహనం, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీన పరచుకున్నామని, షాపూర్ నగర్ లోని డీసీపీ కార్యాలయంలో డీసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. భారీ గంజాయి రవాణా ను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బాల నగర్ ఎస్ ఓ టి సిఐ రాహుల్ దేవ్, మరియు పోలీసులను డీసీపీ అభినందించారు.
తూర్పుగోదావరి జిల్లా.. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో దేవరపల్లి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నర్సీపట్నం పరిధిలో గంజాయిని కొని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించి 326 కేజీల (16 లక్షల విలువచేసే) గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేవరపల్లి పోలీసులు ఒక బోలేరా వాహనం, నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వివరాలు సేకరిస్తున్నారు.
కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఈసుగాం సమీపంలో పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు యాబై వేలు విలువ చేసే 1.4 కిలోల గంజాయి పట్టుపడినట్టు పోలీసులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన రెండు ద్విచెక్ర్ వాహనాలను తనిఖీ చెయ్యగా వారి వద్దనున్న బ్యాగుల్లో గంజాయి పట్టుపడినట్లు తెలిపారు. మహారాష్ట్ర నుంచి కోనుగోలు చేసి ఇక్కడ విక్రయించేందుకు తీసుకు వచ్చినట్టు యువకులు తెలిపారని అన్నారు. ఈ మేరకు రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి ముగ్గురి పై కేసు నమోదు చేసినట్టు ఈసుగాం పోలీసులు తెలిపారు. కాగా పట్టుపడిన యువకులు ముగ్గురు కూడా మైనర్ లే అని పోలీసులు పేర్కొన్నారు.