122
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో వరదాపురం గ్రామంలోని శ్రీ సాయినాథ్ హైస్కూల్ లో తొమ్మిదవ తరగతి విద్యార్థి ఉల్లిపాయల నందకిషోర్ మిస్సింగ్. ఆల్తుర్తి గ్రామానికి చెందిన నందకిషోర్ పాఠశాల యాజమాన్యం నిర్వహిస్తున్న హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. మంగళవారం సాయంత్రం నుంచి కనబడకుండా పోయాడు. నందకిషోర్ మిస్సింగ్ విషయమై పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య సమాధానం. తల్లిదండ్రులు ఆందోళనతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్కూల్ ముందు తల్లిదండ్రులు, బంధువుల నిరసనకు దిగారు.