ఎనిమిదో ఖండం జిలాండియా.. కొత్త ఖండాన్ని కనుగొన్న పరిశోధకులు భూ గోళంపై మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి? అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే.. ఠక్కున ఏడు అని సమాధానమిస్తారు. అయితే ఇకపై ఎనిమిది అని సమాధానమివ్వాల్సి ఉంటుంది.
ఆక్లాండ్, సెప్టెంబర్ 27: భూ గోళంపై మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి? అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే.. ఠక్కున ఏడు అని సమాధానమిస్తారు. అయితే ఇకపై ఎనిమిది అని సమాధానమివ్వాల్సి ఉంటుంది. సుమారు 375 ఏండ్ల తర్వాత పరిశోధకులు కొత్త ఖండాన్ని కనుగొన్నారు. 2017లోనే వెలుగులోకి వచ్చిన ఈ ఖండం ఉనికిని తాజాగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆక్లాండ్‌లో ఉన్న న్యూజిలాండ్ క్రౌన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జీఎన్‌ఎస్ సైన్స్ పరిశోధకులు ఈ మేరకు కొత్త ఖండం మ్యాప్‌ను విడుదల చేశారు. దీంతో ఇప్పటికే ఉనికిలో ఉన్న ఏడు ఖండాలకు తోడు కొత్తగా జిలాండియా వచ్చి చేరింది. దీంతో మొత్తం ఖండాల సంఖ్య ఎనిమిదికి చేరే ఆస్కారం ఉంది.
భూ గోళంపై మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి
200