110
నిర్మల్ జిల్లాలో కొండచిలువలు కలకలం సృష్టిస్తున్నాయి. బాసర అమ్మవారి ఆలయంలోని అక్షరాభ్యాస మంటపం ద్వారం ముందు ఇటీవల కొండ చిలువ కనిపించింది. తాజాగా బాసరలోని బొర్ర గణేష్ కాలనీలో పెద్ద కొండ చిలువ హల్ చల్ చేసింది. గొర్రెల కొష్టంలో సంచరిస్తూ కొండ చిలువ ఏకంగా మేక పిల్లని మింగింది. బాసర గ్రామం బొర్ర గణేష్ కాలనీకి చెందిన జిన్నన్న అనే మేకల యజమాని కి చెందిన మేక పిల్ల ని కొట్టం లో మింగేసింది. కళ్లముందే మేకపిల్లను కొండచిలువ మింగుతున్నా స్థానికులు ఏమీ చేయలేక పోయారు. చివరకు పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. అతను కొండచిలువను బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.