రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని టపాకాయల వ్యాపారస్తులు నిబంధనల మేరకే టపాసుల విక్రయాలు జరపాలని సత్యవేడు శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని మూడు మండలాల్లో టపాసుల విక్రయాలకు రెండు పర్మినెంట్ పర్మిషన్లు ఉన్నాయన్నారు. టెంపరరీ పర్మిషన్ కోసం పలువురు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. పోలీస్ రెవిన్యూ ఫైర్ శాఖల అధికారులు నిర్దేశించిన ప్రాంతాల్లోనే టపాసుల విక్రయాలు నిర్వహించాలన్నారు. లైసెన్సులు మంజూరు కాకముందే టపాసులను నిల్వ ఉంచడం నేరమన్నారు. జన సమర్థ ప్రాంతాల్లో, ఇళ్లల్లో టపాసులను నిల్వ ఉంచుకోకూడదని స్పష్టం చేశారు. నేటి నుంచి టపాసు నిల్వలా కేంద్రాలపై తనిఖీలు ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జన సమర్థ ప్రాంతాల్లో ఎవరైనా టపాసు నిలువలను ఉంచినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. టపాస్ విక్రయ కేంద్రాల వద్ద ఫైర్ సేఫ్టీ మార్గదర్శకాలను అనుసరించి తగిన జాగ్రత్తలను, అగ్ని నిరోధక సామగ్రిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Read Also..