కెసిఆర్ పాలనలో తెలంగాణ మైనారిటీల భవిష్యత్తుకై బంగారు బాటలు ఏర్పాటు చేయడం జరిగింది, 400 మైనార్టీలు విదేశాలలో 20 లక్షల జీతాలు తీసుకుంటూ ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి,బీఆర్ఎస్ శ్రేణులు మైనార్టీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హోంమంత్రి మహమ్మద్ అలీ మాట్లాడుతూ సునీత లక్ష్మారెడ్డి అధిక మెజారిటీతో గెలుపు ఖాయమని తెలంగాణలో మరొకసారి కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడి ఏర్పడుతుందని, మైనార్టీలు మాట ఇస్తే తప్పారని, 100% మైనార్టీల ఓట్లు బిఆర్ఎస్ కు పడతాయని, అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కే మైనార్టీలు తెలంగాణ ప్రజలు పట్టం కడతారని తెలిపారు. మదన్ రెడ్డి ఎంపీ కావడం ఖాయమని, ఎమ్మెల్యే అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందుతుందని జిల్లా అభివృద్ధికి వీరిద్దరూ విశేషంగా కృషి చేస్తారని హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ తెలిపారు.
Read Also..