తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాలల్లో కేసీఆర్ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మూడోసారి ఖమ్మం, కొత్తగూడెంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. జిల్లాలోని ప్రకాశం స్టేడియంలో బీఆర్ఎస్ నేతలు భారీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేశారు. ఈ సభలో కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును కేసీఆర్ ఆశీర్వాదిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల ఆవరణలో ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగిస్తారు. ఉభయ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ నేతలు సీఎం సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఖమ్మంలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు శనివారం నాడు పరిశీలించారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు తదితరులు పరిశీలించారు.
మూడోసారి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ ఎన్నికల ప్రసారం..
90
previous post