144
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీనివాస లాడ్జి లో వ్యక్తి ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం మండూరు నివాసి అట్లూరి గోపాలకృష్ణగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు వల్ల అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. హనుమాన్ జంక్షన్ పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.