పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. స్కూలు నిర్వహణ విషయంలో కానీ నిబంధన విషయంలో కానీ ప్రయాణ విషయంలో గానీ, నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం స్కూల్ నిర్వహణ విషయంలో అనేక ఆరోపణలు ఇప్పటికే ఎదుర్కొంటూ ఉంది, అయినప్పటికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్కూలు నిర్వహిస్తూ ఉంది. ఈరోజు శశి స్కూల్ విడిచి పెట్టినప్పుడు కుంచనపల్లి గ్రామానికి చెందిన 6వ తరగతి చదువుతున్న తూముల దేవదత్త అనే బాలుడు సైకిల్ పై వెళుతుండగా గుంతలో పడి పక్కనే వస్తున్న శశి స్కూల్ బస్సును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన విషయం పలువురిని కలవరపరుస్తుంది. అంతేకాకుండా బాలుడు మరణించి కొంతసేపు గడిచినప్పటికీ ప్రక్కనే ఉన్న శశి స్కూల్ యాజమాన్యం గాని బస్సు డ్రైవర్ గాని కనిపించకుండా వెళ్లిపోవడం, పక్కనే ఉన్న ఏపీ నీట్ విద్యార్థులు చొరవతో ఆ బాలుడిని ప్రవేటు హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పటికీ బాలుడు అప్పటికే మరణించారని డాక్టర్ నిర్ధారించారు. ఇంత జరుగుతున్న స్కూల్ యాజమాన్యం చోద్యం చూస్తూ ఉంది .కొంతసేపటి తర్వాత బాలుడిని తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ కి చేర్పించినప్పటికె ఆ బాలుడు మరణించిన తర్వాత యాజమాన్యం మొత్తం అక్కడకు వచ్చి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అలాగే శశి ఇంజనీరింగ్ కాలేజ్ రెండు పక్కనే ఉండటమే కాకుండా అదే మార్గంలో ఏపీ నిట్ అవుట్ గేట్ అలాగే అధికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్ కూడా ఈ మార్గంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మార్గంలో ప్రతిరోజు సుమారుగా శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సులు 40 నుండి 50 బస్సుల వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తిరుగుతూ ఉంటాయి, కానీ ఈ రోడ్డు చాలా అధ్వానంగా గుంతలతో కూడుకొని ఉంటుంది. ఇటు మునిసిపాలిటీ అధికారులు గాని, శశి యాజమాన్యం గాని పట్టించుకోకపోవడం అలాగే శశి స్కూల్ రాత్రి 7:30 వరకు నిర్వహిస్తున్నప్పటికీ ఒక లైటు కూడా ఈ మార్గమధ్యంలో లేకపోవడం తల్లిదండ్రులలో కలవర పరుస్తుంది. ఎన్నోసార్లు ఈ మార్గంలో తల్లిదండ్రులు పిల్లలను తీసుకెళ్తూ, వస్తూ ఉండే మార్గంలో వర్షాకాలంలో గుంతల్లో పడి కాళ్లు చేతులు కొట్టుకున్న పరిస్థితులు చూశారు. వేసవికాలంలో దుమ్ము రేపుతూ వెళుతున్న బస్సుల మధ్య సైకిల్ పైన వచ్చే పిల్లలు వెళుతూ ఉండటం, మార్గమధ్యంలో పాములు రోడ్డుకి అడ్డంగా రావడం, జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నిసార్లు స్కూలు యాజమాన్యాన్ని అడిగిన కనీసం ఒక్కసారి కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం గాని దీనిపై చర్యలు తీసుకోవడం గాని జరగలేదు. గతంలో ఈ శశి స్కూల్ నిర్వహణపై అనేకమార్లు పలు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంది. అయినప్పటికీ విద్యార్థుల పైన సైకిల్ పైన వచ్చే విద్యార్థిని విద్యార్థుల పైన రోడ్డు మార్గంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకొకపోవడమే కాకుండా కనీసం తల్లిదండ్రుల యొక్క నిర్ణయాలు కూడా తీసుకోకుండా స్కూలు నిర్వహిస్తూ ఉంటుంది. దీనిపైన విద్యాశాఖ అధికారులు కూడా ఏమీ పట్టనట్టుగా చూస్తూ ఉండటం మామూళ్ళు మత్తులో మునిగి ఉంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కొందరు తల్లిదండ్రులు ఈ విషయంపై అడిగినప్పటికీ ఏమీ స్పందించకుండా విద్యార్థుల ఫీజులు విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ పిల్లల్ని నిర్బంధిస్తూ ఫీజు కట్టే విషయంలో స్కూల్ యాజమాన్యం కఠినంగా వ్యవహరిస్తుందని అందుకే ఏ విధమైన కంప్లైంట్ స్కూల్ పైన చేయకుండా తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని ఆందోళన చెందుతున్నామని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పైన విద్యాశాఖ అధికారులు కఠినమైన చర్యలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా వ్యవహరించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. మరణించిన తూముల దేవదత్తు(12) తండ్రి సూర్యనారాయణ బ్యాంక్ ఆఫ్ బరోడా లో క్లర్క్ గా పనిచేస్తున్నాడు, తల్లి విజయవాడలో సి .టి.ఓ .గా పనిచేస్తున్నారు. ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రులు ఉద్యోగం కావడం వల్ల కుమారుడు కోసం సైకిల్ కొని ఇచ్చి వెళ్లి రావడానికి ఏర్పాటు చేశారు. ఇటువంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని ఇప్పటికైనా స్కూలు యాజమాన్యం స్పందించి కనీసం గుంతలు రోడ్లు పూడిపించి దుమ్ము లేవకుండా ఉదయం సాయంత్రం వాటరింగ్ చేయించాలని నిర్బంధ విద్యకు స్వస్తి పలకాలని కోరుకుంటున్నారు.
6వ తరగతి విద్యార్థి మృతి..
69
previous post