73
కృష్ణాజిల్లా.. అవనిగడ్డ నియోజకవర్గం.. ఉల్లిపాలెం శ్రీమన్నారాయణస్వామి వారి దేవాలయలంలో నగలు చోరీ.. ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ ఆలయంలో గురువారం అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. దొంగలు ఆలయ ప్రధాన ద్వారాల తాళాలు పగలు కొట్టారు. రాజ్యలక్ష్మి, గోదాదేవి అమ్మవారి ఉపాలయాల్లో విలువైన బంగారం వెండి ఆభరణాలు చోరీ చేశారు. అమ్మవార్లకు పూజలకు వినియోగించే వెండి పాత్రలు, దేవేరుల మంగళ సూత్రాలు అపహరణకు గురైనట్లు సమాచారం. సమాచారం తేలుసుకున్న, ఎస్సై వి. రాజేంద్రప్రసాద్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి పరిశీలించి, దేవస్థానం అర్చకులను, గ్రామస్తులను వివరాలను చేపట్టారు.