మైనారిటీలను సీఎం జగన్ నాలుగన్నరేళ్లుగా మోసం చేశారని బీజేపీ మైనార్టీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ విమర్శించారు. కాకినాడ బిజెపి కార్యాలయం జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో దుల్హన్ పథకం ద్వారా రూ.50వేలు ఇచ్చేవారన్నారు. ఎన్నికల్లో దుల్హన్ పథకంలో రూ.లక్ష అందిస్తానని చెప్పిన జగన్ నాలుగున్నరేళ్లుగా సవాలక్ష నిబంధన లతో దుల్హన్ పథకం ఏ ఒక్కరికి అందకుండా చేశాడన్నారు. గత ప్రభుత్వం విదేశి విద్యకు రూ.10లక్షలు ఇస్తే, తాను రూ.15లక్షలు చేస్తానని చెప్పి జగన్ విద్యా ర్థులను మోసం చేశాడన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నిటిలో కేంద్రం నిధులే ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం పేర్లు పెట్టుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తుందన్నారు. గృహనిర్మాణానికి సంబంధించి బోర్డులలో కూడా ముఖ్యమంత్రి జగన్ బొమ్మ వేసుకుంటూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఈ విధానాన్ని మార్చుకోకపోతే కేంద్ర ప్రభుత్వం అధికారులను బాధ్యులను చేస్తుందన్నారు. ఈ సమావేశంలో బిజెపి మేధావుల సంఘం రాష్ట్ర కన్వీనర్ రాష్ట్ర ముత్తానవీవ్ కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కోక్కిలిగడ్డ గంగరాజు, డివి సూర్యనారాయణ రాజు, కవి కొండల భీమ శేఖర్, ధనరాజు, గంగాధర్, రంబాల వెంకటేశ్వరావు, చోడిశెట్టి రమేష్ బాబు , చిట్టీడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Also..