62
ముంబైలోని బాంద్రాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి టోల్ ప్లాజా వద్ద నిలిపిఉంచిన పలు కార్లను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. సీ లింక్‌లో టోల్ ప్లాజాకు 100 మీటర్ల సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు తొలుత మెర్సిడెస్ బెంజ్ కారును ఢీకొట్టింది. అప్పటికీ ఆగకుండా మరో నాలుగు వాహనాలను ఢీకొట్టిందని డీసీపీ కృష్ణకాంత్ ఉపాధ్యాయ్ తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పిరస్థితి విషమంగా ఉందని చెప్పారు.