66
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని మాధవాయుపాలెం రేవు సమీపంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లి కొడుకులు ఇద్దరు అరగంట వ్యవధిలో గుండెపోటుతో మృతి చెందారు. రేవులో కిరాణా వ్యాపారం చేసుకునే ముత్తయ్య భార్య మంగతాయారు( 65) ఉదయం గుండే పోటుతో మృతి చెందింది. ఈ వార్త విన్న కుమారుడు లక్ష్మణ్ (40) షాక్ కు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. లక్ష్మణ్ కూడా తీవ్ర గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు చెప్పటంతో అరగంట వ్యవధిలో తల్లి కొడుకులు ఇద్దరు చనిపోవడం అందరిని కంటతడి పెట్టించింది.