76
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టారు. కొద్దిసేపటి కిందట వాదనలు పూర్తయ్యాయి. స్కిల్ కేసులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఎన్నికల ముంగిట చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేశారని లూథ్రా వాదించారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కోర్టుకు వివరించారు. చంద్రబాబును ఇరికించడం కోసమే ఫోరెన్సిక్ రిపోర్టు తయారు చేశారని లూథ్రా ఆరోపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది.