పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ బి కే మెరక గ్రామ సంఘానికి సంబంధించి శ్రీనిధి నిధులు అవకతవకలపై జిల్లాఉన్నత అధికారులు ఆదేశాల మేరకు పేరుపాలెం సౌత్ బి కే మెరక గ్రామంలో అధికారులు గ్రామ సంఘాల మహిళలతో విచారణ చేపట్టారు.గ్రామ సంఘం లో లావాదేవీలు ఎపియం ,సీసీ లు చూసుకోవాలని వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రూ 14 లక్షలు రూపాయిలు నిధుల దుర్వినియోగం జరిగిందని అన్నారు.మండలంలోని డ్వాక్రా సంఘాల సభ్యులు చెల్లించిన స్త్రీ నిధి బకాయిల కు రశీదులు వెంటనే పొందాలని సూచించారు రసీదులు పొందకుండా వాయిదా సొమ్మును చెల్లించామంటే కట్టాల్సిన అప్పు మొత్తాన్ని ఆయా సంఘాలు భరించాలని అన్నారు దీంతో మహిళా సంఘాలతో సమావేశం రసా బసాగాసాగింది. మరో వైపు ఎపీయం తన పై అన్యాయంగా కక్ష పూరితంగా కేసు పెట్టించి ఇబ్బందులకు గురిచేసిందని వి. ఓ ఏ ఆరోపించింది.
శ్రీనిధి నిధుల అవకతవకల పై సమావేశం..
75
previous post