తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి పంచమి సారెను పంపించారు..తిరుచానూరులో జరుగుతున్న అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ముగింపు ఘట్టమైన పంచమి తీర్థం సందర్భంగా అనాధిగా వస్తున్న అచారం ప్రకారం వెదురు గంపలో పసుపు-కుంకుమ, చందనం, పట్టుచీర పెట్టి గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేకపూజలు చేసి ఊరేగింపుగా కాలినడకన తిరుచానూరుకి తీసుకెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం నాలుగు మాడవీధులలో అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి మెట్ల మార్గం గుండా తిరుపతికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. మధ్యహ్నం 12:00 గంటలకు జరగనున్న పద్మావతి అమ్మవారి పంచమి తీర్థ పూజ కార్యక్రమంలో పసుపు-కుంకుమ సారెను అర్చకులు అమ్మవారికి అలంకరిస్తారు. టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకంగా శ్రీవారి ఆలయం నుంచి తీసుకెళ్లే సారుకు ఎంతో విశిష్టత ఉందని, పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఆఖరి ఘట్టమైన పంచమి తీర్థ మహోత్సవానికి ఎంతో విశిష్టత ఉందని అన్నారు. వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తారని, అందుకు తగిన ఏర్పాట్లను టిటిడి పూర్తి చేసిందని భక్తులు భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరించాలని అన్నారు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి..
Read Also…
Read Also…