62
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్‌లో సాయంత్రం 5గంటల వరకు 71.16శాతం పోలింగ్ నమోదు కాగా ఛత్తీస్‌గఢ్ రెండో దశలో 67.70శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ సమయం ముగిసే సమయానికి ఓటు కోసం క్యూలైన్‌లో ఉన్నవారికి అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం మరింతగా పెరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఆప్ సహా ఇతర పార్టీలు బరిలో ఉన్నప్పటికీ అంత ప్రభావంచూపే పరిస్థితిలో లేవు.