తెలుగు రాష్ట్రాలకు చెందిన 15 మంది యాత్రికులు కేదార్‌నాథ్‌లో చిక్కుకున్నారు. గత నెల 31న అక్కడికి వెళ్లిన వారు వర్షాలకు రహదారులు తెగిపోవడంతో తిరిగి రాలేకపోయారు. ఏపీకి చెందిన అడప సత్యనారాయణ్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి సంజయ్‌కి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా మంత్రి స్పందించారు. యాత్రికులను తరలించడానికి చర్యలు చేపట్టాలని రుద్రప్రయాగ్ కలెక్టర్‌కు సూచించారు.కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు, శనివారం హెలికాప్టర్ ద్వారా 12 మంది యాత్రికులను ఉత్తర కాశీకి తరలించారని, తెలంగాణకు చెందిన ముగ్గురు యాత్రికులు అక్కడే ఉన్నారని సత్యనారాయణ్ తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్ వరదల్లో గల్లంతైన కేదార్నాథ్ యాత్రికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గౌరీకుంద్, కేదార్నాథ్ దారిలో కొండచరియలు విరిగిపడటంతో వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. అందులో 18 మంది యాత్రికులు గల్లంతయ్యారు. దాంతో రంగంలోకి దిగిన NDRF రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. మూడువేల మంది యాత్రికులను రక్షించింది. గల్లంతైన 18 మంది కోసం హెలికాప్టర్లు, డ్రోన్లను రంగంలోకి దింపింది. మొత్తం చిక్కుకు పోయిన యాత్రికులు 10 వేల మంది వరకు ఉంటారని అధికారులు అంచనావేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్.పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “ఎస్ ఆర్ కళ్యాణమండపం” డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.3 సినిమా “ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్…
- “15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.“15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా..” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్ తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే ‘పంచనామా’ సిరీస్.…
- హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హైకూ’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్,…
- ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.ఈ నెల 18న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు,…
- ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.బానోత్ పవన్, గౌతమ్, నర్మద, సతీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఐ బొమ్మ”. ఈ చిత్రాన్ని శ్రీ మల్లన్న క్రియేషన్స్ బ్యానర్ పై కురువ జమన్న నిర్మిస్తున్నారు. విజయ్ రఘునాథభట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో వరల్డ్ వైడ్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి