Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home Devotional వారణాసి ఆలయంలో పోలీసులకు దోతి కుర్తా డ్రెస్..!

వారణాసి ఆలయంలో పోలీసులకు దోతి కుర్తా డ్రెస్..!

by Satya
Dhoti kurta dress for police in Varanasi temple

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)రాష్ట్రం వారణాసి(Varanasi)లోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయం(Kashi Vishwanatha Temple)లో విధులు నిర్వర్తించే పోలీసులు దోతి కుర్తా(Dhoti Kurta) ధరించారు. మహిళా పోలీసులు సల్వార్‌ కుర్తాలో కనిపించారు. వారికి దోతీ కుర్తా, సల్వార్‌ కుర్తాలను ఉన్నతాధికారులు డ్రెస్‌కోడ్‌గా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, దీనిపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇది చదవండి: శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాల తయారీ..

విధుల్లో ఉన్న పోలీసులు తమ యూనిఫాం కాకుండా ఇతర దుస్తులు ధరించడం ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల భద్రతకు ముప్పు కలుగుందని చెప్పారు. పోలీసులు పూజారుల వేషం వేయడం సరైంది కాదన్నారు. నేరగాళ్లు కూడా ఇలాంటి దుస్తులు ధరించి ప్రజలను మోసం చేసే అవకాశం ఉందన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: