Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home Andhra Pradesh కుర్లపల్లి గ్రామంలో అపశృతి.. 200 మందికి ఫుడ్ పాయిజన్..!

కుర్లపల్లి గ్రామంలో అపశృతి.. 200 మందికి ఫుడ్ పాయిజన్..!

by Satya
Disruption in Kurlapalli village

శ్రీ సత్యసాయి జిల్లా(Sri Sathya Sai District) కనగానపల్లి మండలం(Kanaganapally Mandal), కుర్లపల్లి గ్రామం(Kurlapalli village)లో అపశృతి చోటు చేసుకుంది. శుక్రవారం గ్రామంలో రాముని గుడి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఇది చదవండి: తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీని పంపించేయాలి

వీరిని వెంటనే ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్(Food poisoning) తో సుమారు 200 మంది భక్తులు వాంతాలు, విరోచనాలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న MLA కేతిరెడ్డి, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ బాధితులను పరామర్శించారు. పేషంట్లకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: