Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home National బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో..

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో..

by Satya
Bullet Proof jacket

దేశంలోని భద్రతా బలగాల కోసం డీఆర్‌డీవో(DRDO).. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ మరో పరికరాన్ని విజయవంతంగా పరీక్షించింది. అత్యంత తేలికైన బుల్లెట్‌ ప్రూఫ్ జాకెట్‌(Bullet Proof jacket)ను అభివృద్ధి చేసింది. తీవ్రమైనదిగా పరిగణించే లెవెల్- 6 ముప్పుని సైతం ఎదుర్కొనేలా దీనిని రూపొందించింది. ఈ జాకెట్ 7.62 x 54 ఆర్ ఏపీఏ మందుగుండు సామగ్రి పేలుడు నుంచి కూడా రక్షణనిస్తుందని డీఆర్‌డీవో ప్రకటనలో పేర్కొంది.

ఇది చదవండి: సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం…

కొత్త ప్రక్రియలో నూతన మెటీరియల్‌ను ఉపయోగించి దీనిని రూపొందించినట్టు పేర్కొంది. కాన్పూర్‌లోని డీఆర్‌డీవో విభాగం డీఎంఎస్ఆర్‌డీఈ(DMSRDE) డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ దీనిని తయారు చేసిందని తెలిపింది. మందుగుండు సామాగ్రి నుంచి కూడా రక్షణ ఇవ్వగలదని, దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ ఇదేనని పేర్కొంది. ఇటీవలే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను చండీగఢ్‌(Chandigarh)లో విజయవంతంగా పరీక్షించినట్టు తెలిపింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హిమంత బిశ్వశర్మ..
    హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారంతో అసోం రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. గౌహతిలోని ఖానాపరాలో జరిగిన వేడుకలో హిమంత బిశ్వ శర్మ అసోం ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణం…
  • నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ కలకలం.
    నీట్‌ యూజీ-2026 కి సంబంధించి ప్రశ్నాపత్రం లీక్‌ అయినట్లు వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. పరీక్షకు ముందు రాజస్థాన్‌లో కోచింగ్‌ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్‌తో ప్రశ్నా పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో విద్యార్థులు…
  • తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం..
    తమిళనాడులో టీవీకే అధికారంలోకి వచ్చిన తరవాత సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో స్కూళ్లు, దేవాలయాలు, కాలేజీలకు దగ్గరలో ఉన్న మద్యం షాపులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారులతో చర్చించారని త్వరలోనే అమలు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

012218
Total views : 74522

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.