ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే ఆంక్షలు..
ఇరాన్(Iran)తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ముందు తాము ఆంక్షలు విధిస్తామనే విషయాన్ని గుర్తెరగాలని పాకిస్థాన్(Pakistan)ను అగ్రరాజ్యం అమెరికా(America) హెచ్చరించింది. ఆంక్షలు విధించడంతో పాటు ఒప్పందాలకు అంతరాయం కలిగిస్తామని, ఇతర చర్యలకు ఉపక్రమిస్తామని వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్(Ballistic Missile Program) సరఫరాదారులపై అమెరికా ఆంక్షలు విధించడం యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ వేదాంత్ పటేల్ స్పందించారు. నెట్‌వర్క్‌ల విస్తరణ, విధ్వంసక ఆయుధాల సేకరణకు సంబంధించిన కార్యకలాపాలు ఎక్కడ జరిగినా తాము అంతరాయం కలిగిస్తామని, చర్యలను కొనసాగిస్తామని వేదాంత్ పటేల్ స్పష్టం చేశారు.
ఇది చదవండి: ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో విజయం…
స్థూలంగా చెప్పాలంటే ఇరాన్‌తో వ్యాపార ఒప్పందాలను పరిగణించే ఎవరైనా ఆంక్షలు ఉంటాయనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఈ మేరకు అన్ని దేశాలకు సలహా ఇస్తున్నామని అన్నారు. ప్రజల వినాశనానికి సంబంధించిన ఆయుధాలు, వాటి పంపిణీని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఆంక్షలు విధించాల్సి వచ్చిందని ఒక ప్రశ్నకు వేదాంత్ పటేల్ సమాధానమిచ్చారు. పాకిస్థాన్ మిసైల్ ప్రోగ్రామ్‌కు సరఫరాదారులుగా ఉన్న కంపెనీలు చైనా, బెలారస్‌లో ఉన్నాయని ఆయన ప్రస్తావించారు. ఈ కంపెనీలు పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి పరికరాలు, ఇతర వస్తువులను సరఫరా చేసినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మూడు రోజుల పాకిస్థాన్ సందర్శన నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా రైసీ పాక్ పర్యటనలో ఇరుదేశాలు 8 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.జనరిక్ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
- ఆప్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు.ఆప్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు విలయం సృష్టిస్తున్నాయి. పెద్దసంఖ్యలో ప్రాణాలను బలితీసుకున్నాయి. ఈశాన్య ప్రాంతమైన నూరిస్థాన్ ప్రావిన్స్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ జలప్రళయంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా గల్లంతయ్యారు. దుర్గమ పర్వత ప్రాంతంలో…
- మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం.మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం మరింత తీవ్రంగా మారుతోంది. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న సైనిక దాడులు కొత్త మలుపు తిరిగాయి. తాజాగా జోర్డాన్‌లోని అల్-అజ్రాఖ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ భారీ క్షిపణి, డ్రోన్ దాడులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి




Total views : 223739