Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Politics సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం…

సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం…

by Prakash
Polling

తొలిదశ పోలింగ్ (Primary Polling) :

సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ (Primary Polling) ప్రారంభం అయింది. తొలిదశలో 17 రాష్ట్రాలు, 4 యూటీల్లోని 102 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తొలిదశ లోక్‌సభ ఎన్నికల బరిలో 1,652 మంది అభ్యర్థులు ఉన్నారు. నేడు 16.63 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1.87 లక్షల పోలింగ్ కేంద్రాల్లో తొలిదశ పోలింగ్ కొనసాగనుంది. తమిళనాడులోని అన్ని స్థానాలకు తొలి దశలోనే పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 50, సిక్కిలోని 32 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది.

ఇది చదవండి : సీఎం జగన్‌పై దాడి కేసు.. నిందితుడికి 14 రోజలు రిమాండ్..!

అరుణాచల్‌ప్రదేశ్‌లో 60 స్థానాలకు గాను 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవం అయింది. 8 మంది కేంద్ర మంత్రుల భవితవ్యాన్ని తొలిదశలో ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికలు శాంతియుతంగా, సజావుగా జరిగేలా ఈసీ అన్ని చర్యలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. సగానికి పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు చేశారు. తొలిదశ పోలింగ్ కోసం 361 మంది పరిశీలకులను ఈసీ నియమించింది. 5వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళా అధికారులకు విధులు నిర్వహించే బాధ్యతలు అప్పగించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..
    కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రకటించారు. వీటి ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదొక చరిత్రాత్మక రోజు…
  • బీజేపీలో చేరిన 24 గంటల్లో ఫాలోవర్ల తగ్గుదల..
    ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన రాఘవ్ చడ్డాకు ఊహించని షాక్ తగిలింది. పార్టీ మారిన 24 గంటల్లోనే ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లలో సుమారు పది లక్షల మంది తగ్గినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జెన్ జీ యువత పెద్ద…
  • పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ..
    పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పోలీసుల అనుమతి నిరాకరణతో వాయిదా పడిన ఆయన సభలకు తాజాగా మార్గం సుగమమైంది. ఈ రోజు కోల్‌కతా, సెరంపూర్‌లలో రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం…
Advertisements

You may also like

Our Visitor

008615
Total views : 56956

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.