తొలిదశ పోలింగ్ (Primary Polling) :
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ (Primary Polling) ప్రారంభం అయింది. తొలిదశలో 17 రాష్ట్రాలు, 4 యూటీల్లోని 102 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తొలిదశ లోక్‌సభ ఎన్నికల బరిలో 1,652 మంది అభ్యర్థులు ఉన్నారు. నేడు 16.63 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1.87 లక్షల పోలింగ్ కేంద్రాల్లో తొలిదశ పోలింగ్ కొనసాగనుంది. తమిళనాడులోని అన్ని స్థానాలకు తొలి దశలోనే పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 50, సిక్కిలోని 32 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది.
ఇది చదవండి : సీఎం జగన్‌పై దాడి కేసు.. నిందితుడికి 14 రోజలు రిమాండ్..!
అరుణాచల్‌ప్రదేశ్‌లో 60 స్థానాలకు గాను 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవం అయింది. 8 మంది కేంద్ర మంత్రుల భవితవ్యాన్ని తొలిదశలో ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికలు శాంతియుతంగా, సజావుగా జరిగేలా ఈసీ అన్ని చర్యలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. సగానికి పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు చేశారు. తొలిదశ పోలింగ్ కోసం 361 మంది పరిశీలకులను ఈసీ నియమించింది. 5వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళా అధికారులకు విధులు నిర్వహించే బాధ్యతలు అప్పగించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- బీహార్‌లో ఉగ్రరూపం దాల్చిన వరదలు.బీహార్‌లో భారీ వర్షాలకు తోడు నేపాల్ నుంచి వస్తున్న వరద నీటితో నదులు ఉగ్రరూపం దాల్చాయి. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 10 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. పాట్నాలోని గాంధీ ఘాట్ వద్ద గంగానది ఆల్‌టైమ్ రికార్డు…
- ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం.ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి సత్కరించారు. దేశవ్యాప్తంగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన మొత్తం 82 మంది ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సన్మానించారు. పాఠశాల విద్య,…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం…