274
ప్రభుత్వం ప్రజల వద్దకే వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రావిగూడెం గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లోని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపేందుకే ప్రజాదర్బార్ ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 27 నుంచి ఉమ్మడి జిల్లాలోని ప్రతి మండలంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు.