67
ఏలూరుజిల్లాలో కార్తీక మాసం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆలయంలోకి ప్రవేశించగానే భక్తుల వద్ద నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. భక్తులకు ప్రభుత్వ గుర్తింపు లేని సొంతంగా తయారు చేసిన రసీదులిస్తూ అక్రమ దందాకు సిబ్బంది పాల్పడుతున్నారు. ఆలయానికి వస్తున్న భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. పూజలు,, అభిషేకాలు హారతుల పేరుతో 20 రూపాయల నుంచి 300 రూపాయల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆలయ మాజీ చైర్మన్ వేణుగోపాల్, ఈవో విశ్వేశ్వర రావు , సిబ్బంది కుమ్మక్కై ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also..
Read Also..