74
తెలుగు రాష్ట్రాల్లో రెవిన్యూ అధికారుల చేతివాటం మామూలుగా ఉండదు. శ్రీకాకుళం జిల్లాలో రెవిన్యూ అధికారుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. జీ సిగడం మండలంలోని రెవెన్యూ అధికారులు…ముడుపులు లేనిదే ఎటువంటి పనులు చేయడం లేదు. సంతవూరిటీ గ్రామానికి చెందిన సీతాలక్ష్మి … తన అత్తమామల ఆస్తులను కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు. అయితే అదే కుటుంబానికి చెందిన కొంతమంది… ఎమ్మార్వో కు లంచం ఇచ్చి… వీలునామా చేసుకుని 1 బి అడంగల్ లో … తమపేర్లు ఉండే విధంగా చేసుకున్నారు. అయితే… ఆ భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉంటే.. వారి పేరు మీద వన్ బి ఆడంగల్ ఎలా వచ్చిందని సీతాలక్ష్మి ప్రశ్నిస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత మహిళ సీతాలక్ష్మి కోరుతోంది.