ఓటమన్నదే ఎరుగకుండా వరల్డ్ కప్ ఫైనల్ వరకు దూసుకొచ్చి, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన టీమిండియాపై సానుభూతి పవనాలు వీస్తున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దీన్ని దురదృష్టంగానే భావించాలని సూచించాడు. టోర్నీ అంతటా అద్భుతంగా ఆడాక, చివరికి ఒక్క మ్యాచ్ లో అదృష్టం ముఖం చాటేస్తే హృదయం బద్దలవుతుందని పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఆవేదనను అర్థం చేసుకోగలను. అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఓటములన్నది ఆటలో భాగం. ఒక్క విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి… టీమిండియా ఈ టోర్నీ ఆసాంతం అత్యుత్తమ ఆటతీరు కనబర్చింది అని సచిన్ ఓదార్పు వచనాలు పలికారు. వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా జట్టుకు సచిన్ అభినందనలు తెలిపారు. ఆరోసారి వరల్డ్ కప్ గెలిచినందుకు కంగ్రాచ్యులేషన్స్. వరల్డ్ కప్ వంటి అత్యున్నత వేదికపై ముఖ్యమైన రోజున మెరుగైన క్రికెట్ ను ప్రదర్శించారు అంటూ సచిన్ ఆసీస్ ఆటగాళ్లను కొనియాడారు.
ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు
84
previous post