ఈ నెల 23 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ కు ఏపీ తూర్పు తీర నగరం విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది. కాగా, ఈ సిరీస్ కోసం పలువురు టీమిండియా ఆటగాళ్లు వైజాగ్ చేరుకున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ముఖేశ్ కుమార్, అర్షదీప్ సింగ్, జితేశ్, రింకూ సింగ్ తదితరులు విశాఖలో అడుగుపెట్టారు. కాగా, ఈ సిరీస్ లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వరల్డ్ కప్ లో ఆడిన టీమిండియాలోని చాలామంది ఆటగాళ్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్, యజువేంద్ర చహల్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లకు చాన్స్ లభిస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పరుగుల వెల్లువ సృష్టించిన రియాన్ పరాగ్ ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. కాగా, ఈ సిరీస్ లో టీమిండియా కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తారని తెలుస్తోంది. టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ఈ వరల్డ్ కప్ తో ముగియనుంది.
rohith sharma
ఓటమన్నదే ఎరుగకుండా వరల్డ్ కప్ ఫైనల్ వరకు దూసుకొచ్చి, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన టీమిండియాపై సానుభూతి పవనాలు వీస్తున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దీన్ని దురదృష్టంగానే భావించాలని సూచించాడు. టోర్నీ అంతటా అద్భుతంగా ఆడాక, చివరికి ఒక్క మ్యాచ్ లో అదృష్టం ముఖం చాటేస్తే హృదయం బద్దలవుతుందని పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఆవేదనను అర్థం చేసుకోగలను. అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఓటములన్నది ఆటలో భాగం. ఒక్క విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి… టీమిండియా ఈ టోర్నీ ఆసాంతం అత్యుత్తమ ఆటతీరు కనబర్చింది అని సచిన్ ఓదార్పు వచనాలు పలికారు. వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా జట్టుకు సచిన్ అభినందనలు తెలిపారు. ఆరోసారి వరల్డ్ కప్ గెలిచినందుకు కంగ్రాచ్యులేషన్స్. వరల్డ్ కప్ వంటి అత్యున్నత వేదికపై ముఖ్యమైన రోజున మెరుగైన క్రికెట్ ను ప్రదర్శించారు అంటూ సచిన్ ఆసీస్ ఆటగాళ్లను కొనియాడారు.
భారత్ గెలవకపోవడం అభిమానుల్లో టెన్షన్ పెంచుతోంది.ఈ ప్రపంచకప్లో అజేయంగా కొనసాగిన టీమ్ ఇండియాకు వాంఖడే స్టేడియం రికార్డులు కాస్త ఇబ్బందిని కలిగిస్తున్నాయి. వాంఖడే వేదికగా ఇప్పటివరకు జరిగిన ఒక్క సెమీఫైనల్ మ్యాచ్లోనూ టీమిండియా గెలవకపోవడమే అందుకు కారణం. దీంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇదే మైదానంలో రేపు నవంబర్ 15న టీమిండియా న్యూజిలాండ్ జట్టును ఢీకొట్టనుందా?




Total views : 75371