సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారాస అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం, రోడ్ షోలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ : 1) కోతల రాయుుడు వచ్చాడు ఒకాయన మాటలు ఎక్కువ పని తక్కువ కరీంనగర్ లో ఓడిపోయి ఇక్కడకు వచ్చాడు 2) హుస్నాబాద్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం 3) గతంలో హుస్నాబాద్ లో కాంగ్రెస్, ఎర్రజెండాల పాలనలో కనీసం బుక్కెడు తాగు నీళ్లకు హుస్నాబాద్ నోచుకోలేదు, నేడు బంగారంల రెండు పంటలు పండుతున్నాయి 4) తెలంగాణాలో కేసీఆర్ మీటర్లు పెట్టలేదని అందుకే 35,000 కోట్లు ఆపామని, నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు, 35 వేల కోట్లు ముఖ్యం కాదని రైతులే ముఖ్యమని కేసీఆర్ మీటర్లు పెట్టలేదు 5) కరెంట్ కావాలో, కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి 6) కర్ణాటకలో 5 గ్యారంటీ లని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో 9 గంటలు వచ్చే కరెంట్ ఇప్పుడు 3 గంటలు కూడా రావట్లేదని, అన్నిటిలో కోతలు విధిస్తున్నారని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు 7) కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే బిఆర్ఎస్ మేనిఫెస్టో నూరు పాల్లు నయం 8) ఎగపెట్టిన చరిత్ర కాంగ్రెస్ ది అమలు చేసిన చరిత్ర బిఆర్ఎస్ ది 9) మూడు గంటల కరంటోడు కాంగ్రెస్ ఓ దిక్కు, మీటర్ల బిజెపొడు ఓ దిక్కు, 24 గంటల ఉచిత కరెంటు కేసిఆర్ ఓ దిక్కు, ఏ దిక్కు ఎటుండాలో ప్రజలు ఆలోచించుకోవాలి 10) హుస్నాబాద్ అభివృద్ధికి తాను బాధ్యత తీసుకుంటా, ప్రజలే హై కమాండ్ గా పనిచేసే పార్టీ బిఆర్ఎస్ పార్టీ
హుస్నాబాద్ లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ రోడ్ షో..
65
previous post