క్రిస్టియన్ సోదరి, సోదరీమణులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 23 ఏళ్లుగా క్రమం తప్పకుండా డిసెంబర్ 25న సిద్దిపేట చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నానన్నారు. సిద్ధిపేట చర్చ్ లో నిర్మాణంతో పాటు, ఏ సమస్యలు ఉన్నా ఒక్క అన్న, తమ్ముడిలా అండగా ఉంటానని ఆయన తెలిపారు. ప్రేమ భావాన్ని, క్షమా గుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజున్నారు. ఈ పర్వదినం క్రిస్టియన్ సోదరుల అందరికి శుభం చేకూరాలని ఆ ఏసు ప్రభును ఆయన ప్రార్థించానన్నారు. కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాన్నారు. చర్చ్ ప్రాంగణంలో ఒక అద్భుతమైన కన్వేన్షన్ హాల్ నిర్మాణం చేసుకుందామని. అందుకు పూర్తి సహాయ సహకారం అందిస్తానని తెలిపారు.
Minister Harish Rao
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారాస అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం, రోడ్ షోలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ : 1) కోతల రాయుుడు వచ్చాడు ఒకాయన మాటలు ఎక్కువ పని తక్కువ కరీంనగర్ లో ఓడిపోయి ఇక్కడకు వచ్చాడు 2) హుస్నాబాద్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం 3) గతంలో హుస్నాబాద్ లో కాంగ్రెస్, ఎర్రజెండాల పాలనలో కనీసం బుక్కెడు తాగు నీళ్లకు హుస్నాబాద్ నోచుకోలేదు, నేడు బంగారంల రెండు పంటలు పండుతున్నాయి 4) తెలంగాణాలో కేసీఆర్ మీటర్లు పెట్టలేదని అందుకే 35,000 కోట్లు ఆపామని, నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు, 35 వేల కోట్లు ముఖ్యం కాదని రైతులే ముఖ్యమని కేసీఆర్ మీటర్లు పెట్టలేదు 5) కరెంట్ కావాలో, కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి 6) కర్ణాటకలో 5 గ్యారంటీ లని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో 9 గంటలు వచ్చే కరెంట్ ఇప్పుడు 3 గంటలు కూడా రావట్లేదని, అన్నిటిలో కోతలు విధిస్తున్నారని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు 7) కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే బిఆర్ఎస్ మేనిఫెస్టో నూరు పాల్లు నయం 8) ఎగపెట్టిన చరిత్ర కాంగ్రెస్ ది అమలు చేసిన చరిత్ర బిఆర్ఎస్ ది 9) మూడు గంటల కరంటోడు కాంగ్రెస్ ఓ దిక్కు, మీటర్ల బిజెపొడు ఓ దిక్కు, 24 గంటల ఉచిత కరెంటు కేసిఆర్ ఓ దిక్కు, ఏ దిక్కు ఎటుండాలో ప్రజలు ఆలోచించుకోవాలి 10) హుస్నాబాద్ అభివృద్ధికి తాను బాధ్యత తీసుకుంటా, ప్రజలే హై కమాండ్ గా పనిచేసే పార్టీ బిఆర్ఎస్ పార్టీ
మెదక్ జిల్లా లో ఈనెల 16 న నర్సాపూర్ లో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. హెలిప్యాడ్, సభ వేదిక, సభా ప్రాంగణం ఏర్పాటు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పెద్ద సంఖ్యలో తరలి వచ్చే పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించిన మంత్రి హరీశ్ రావు సూచించారు.
ఎమ్మెల్యే సీతక్క ములుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి హరీశ్ రావుపై సీతక్క మండిపడ్డారు. అగ్గిపెట్టె దొరకని హరీశ్ రావు ఇప్పుడు కారుకూతలు కూస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సీతక్క మంత్రి అవుతుందట’ అంటూ ఎద్దేవా చేస్తున్నాడని విమర్శించారు. ‘ఏ.. నేను మంత్రిని కావొద్దా? నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవద్దా’ అని మంత్రిని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలకు బడుగుబలహీన వర్గాలంటే గిట్టదని సీతక్క ఆరోపించారు. ములుగులో తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, కేటీఆర్ లు నియోజకవర్గంలో డబ్బులు వెదజల్లుతున్నారని ఆరోపించారు. నోట్ల కట్టలతో ప్రజలను కొనాలని చూస్తున్నారు కానీ ములుగు ప్రజలు అమ్ముడుపోరనే విషయం వారికి తెలియదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని ఓటర్లకు ఆమె సూచించారు. వాళ్లు పంచే డబ్బంతా గత పదేళ్లలో ప్రజల నుంచి దోచుకున్నదేనని చెప్పారు. వారిచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం తనకే వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఐదు సంవత్సరాలు మీ కోసం పనిచేశానని, అభివృద్ధిని చూసి తనకు మార్కులు వేయాలని మంత్రి హరీష్ రావు కోరారు..సిద్దిపేట అభివృద్ధి కోసం కష్టపడ్డానని,ఎన్నికల సమయం లో హడావుడి చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హరీష్ రావు కోరారు. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకున్న నాకు మీరు ఓట్ల రూపంలో మార్పులు వేసి దీవించాలని ఆయన కోరారు..
సిద్దిపేట జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణారెడ్డి 50 మంది మహిళా కార్యకర్తల్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు..
టికెట్లు అమ్ముకునే సంస్కృతి ఉన్న కాంగ్రెస్‌పార్టీ రేపు రాష్ట్రాన్ని అమ్ముకోదన్న గ్యారంటీ ఏంటని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆందోల్ మండల పరిధిలోని సంగుపేట వద్ద జరిగిన బూత్ కమిటీల సమావేశానికి హాజరై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి మాట్లాడారు. కాంగ్రెసోళ్లకు ప్రజలు పదకొండు సార్లు అవకాశమిస్తే ఏం డెవలప్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సంగారెడ్డిని జిల్లా చేయలేదు, తలాపున ఉన్న సింగూర్ నుంచి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థులన్నారు. ఆందోల్ కాంగ్రెస్ పెద్ద లీడర్ వాళ్లకు, వీళ్లకు టికెట్ ఇప్పిస్తానని మాటిచ్చి ఇప్పుడు భంగపడ్డారని విమర్శించారు. తెలంగాణ సాధించి అభివృద్ధి వైపు నడిపిస్తున్న కేసీఆర్‌ను వదులుకుంటే తెలంగాణ ప్రజలు ఆగమవుతారన్నారు. కేసీఆర్‌ను గెలిపించుకుటేనే భవిష్యత్ ఉంటుందన్నారు. తల్లి లాంటి బీఆర్ఎస్ను ప్రజల నుంచి దూరం చేయడానికి కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్నారు. కార్యకర్తలు ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.