Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Telangana టికెట్లు అమ్ముకున్నోళ్లు.. రాష్ట్రాన్ని అమ్ముకోరా..!

టికెట్లు అమ్ముకున్నోళ్లు.. రాష్ట్రాన్ని అమ్ముకోరా..!

by Satya
Minister Harish Rao

టికెట్లు అమ్ముకునే సంస్కృతి ఉన్న కాంగ్రెస్​పార్టీ రేపు రాష్ట్రాన్ని అమ్ముకోదన్న గ్యారంటీ ఏంటని మంత్రి హరీశ్​రావు ప్రశ్నించారు. ఆందోల్ మండల పరిధిలోని సంగుపేట వద్ద జరిగిన బూత్​ కమిటీల సమావేశానికి హాజరై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్​తో కలిసి మాట్లాడారు. కాంగ్రెసోళ్లకు ప్రజలు పదకొండు సార్లు అవకాశమిస్తే ఏం డెవలప్​ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సంగారెడ్డిని జిల్లా చేయలేదు, తలాపున ఉన్న సింగూర్​ నుంచి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థులన్నారు. ఆందోల్​ కాంగ్రెస్​ పెద్ద లీడర్​ వాళ్లకు, వీళ్లకు టికెట్ ​ఇప్పిస్తానని మాటిచ్చి ఇప్పుడు భంగపడ్డారని విమర్శించారు. తెలంగాణ సాధించి అభివృద్ధి వైపు నడిపిస్తున్న కేసీఆర్​ను వదులుకుంటే తెలంగాణ ప్రజలు ఆగమవుతారన్నారు. కేసీఆర్​ను గెలిపించుకుటేనే భవిష్యత్​ ఉంటుందన్నారు. తల్లి లాంటి బీఆర్ఎస్​ను ప్రజల నుంచి దూరం చేయడానికి కాంగ్రెస్​, బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్నారు. కార్యకర్తలు ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: