నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో 751.90కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌తోపాటు దాన్ని నిర్వహిస్తోన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది.
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ దిల్లీ, ముంబయి, లఖ్‌నవూ నగరాల్లో 661.69 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ వెల్లడించింది. దీంతోపాటు ఏజేఎల్‌లో ఈక్విటీ షేర్ల రూపంలో యంగ్ ఇండియన్ రూ.90.21కోట్లు కలిగి ఉందని తెలిపింది. మరోవైపు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత పవన్ కుమార్ బన్సల్‌లను ఇదివరకే విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది.
Read Also…
Read Also…