87
మాదాపూర్ SOT, గచ్చిబౌలి పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కోట్ల నగదును సిజ్ చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు కొండాపూర్ బొటానికల్ రోడ్ నుండి చిరెక్ పబ్లిక్ స్కూల్ పైపు బ్రీజా కార్లో నగదును తరలిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా కారులో రెండు సంచుల్లో ఐదు కోట్ల రూపాయల నగదును గుర్తించారు. పట్టు పడ్డ నగదు ఓ వ్యాపారవేత్తకు సంబంధించినదిగా గుర్తించారు. పోలీసులు అట్టి నగదును ఐటి శాఖ అధికారులకు అప్పగించారు.