రెడ్డిగూడెం మండలం నుండి విస్సన్నపేట ప్రవేట్ స్థలంలో భారీగా తోలక నిర్వహిస్తున్న తోలకం దారులను స్థానిక ట్రాక్టర్ యజమానులు అడ్డుకున్నారు.. అనుమతులు లేకుండా తోలకాలు నిర్వహిస్తున్నా అధికారులు స్పందించడం లేదని తెలుపుతున్నారు.. పక్క మండలాల నుండి మట్టితోలకాల నిర్వహించడంతో స్థానిక ట్రాక్టర్ యజమానులు ఫైనాన్స్ కిస్తీలు కూడా కట్టుకోలేక ట్రాక్టర్లు ఫైనాన్స్ వారికి అప్పగిస్తున్నామని, కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించకపోతే పరస్పరం వాహనాలు ఆపుకుని తీవ్ర స్థాయిలో గొడవలు జరిగే అవకాశం ఉంది. మద్దుల పర్వ, విస్సన్నపేట ట్రాక్టర్ల యజమానులు తోలకందార్ల మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవను సద్దుమణిచి ట్రాక్టర్లను స్టేషన్కు తరలించారు.
మట్టి తోలకాలను అడ్డుకున్న గ్రామస్తులు..
77
previous post