94
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కూచివారిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ చదువుతున్న పవన్ (17) అక్కడికక్కడే మృతి చెందగా.. రోహిత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిద్దరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారని స్థానికులు తెలిపారు. అగ్రహారానికి చెందిన వాళ్లుగా గుర్తించారు. అతివేగంగా వెళుతూ బైక్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగినట్లు ఆనవాల్లు ఉన్నాయి. మృతుని తల్లిదండ్రులు శ్రీశైలం తీర్థయాత్రకు రాత్రి వెళ్లారు. పవన్ సోదరి కన్నీటి పర్యంతమవుతా శోకసముద్రంలో మునిగిపోయింది. క్షతగాత్రుని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.