తెలంగాణ రాష్ట్రం ఇచ్చే సమయంలో మిగులు రాష్ట్రంగా అప్పజెబితే సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రం చేశాడని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. రాష్ట్రంలో పతి ఒక్కొక్కరిపై రూ. 1,40,000 వేల వరకు అప్పు ఉందని ఆయన అన్నారు. సోమవారం నరసాపూర్ నియోజకవర్గం శివంపేట మండల పరిధిలోని గొట్టిముక్కుల గ్రామ సమీపంలో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభకు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడక ముందు ఇచ్చిన హామీలను తర్వాత మరిచిపోయారని ఆరోపించారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తే కోటి ఉద్యోగాలను ఇస్తానని ప్రధాని మోడీ ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. సీఎం కాకముందు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడు ఎకరాల ఇస్తామని చెప్పి అధికారం రాగానే వాటిని మరిచిపోయారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుతుంటుందని విమర్శించారు. పేద ప్రజలు కలవడానికి సమయం ఇవ్వని కేసీఆర్ ఇసుక మాఫియా మట్టి మాఫియా లిక్కర్ మాఫియాలు, ధనికులు కలవడానికి ప్రత్యేక సమయం ఇస్తాడని విమర్శించారు.
మిగులు రాష్ట్రన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు – మల్లికార్జున్
67
previous post