సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో కార్మిక సంఘాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్దం కావడానికి మరింత సమయం కావాలని తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించింది. గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. విచారణను ఈ నెల 18 కి వాయిదా వేసింది.
CM KCR
హుస్నాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి వోడితల సతీష్ కుమార్.. వోడితల సతీష్ కుమార్ 1965లో జన్మించారు. తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. డిజైన్ ఇంజనీర్ విభాగంలో సతీష్ కుమార్ ఎంటెక్ పూర్తి చేశారు. 1989 లో రాజకీయాలలోకి ప్రవేశించారు. 1995లో సింగాపూర్ గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2001లో టిఆర్ఎస్ లో చేరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2002లో హుజురాబాద్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2005 లో తుమ్మనపల్లి ఫ్యాక్స్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. 2006లో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా ఎన్నికయ్యారు. 2012 లో టిఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించబడ్డారు. 2014లో టిఆర్ఎస్ పార్టీ నుండి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి 2018 ఎన్నికల్లో ప్రత్యర్థి పై 70 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తో ఎమ్మెల్యే సతీష్ కుమార్ కుటుంబం సన్నిహిత సంబంధం కలిగి ఉంది. ముచ్చటగా మూడోసారి హుస్నాబాద్ అసెంబ్లీ నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ బరిలోకి దిగారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చే సమయంలో మిగులు రాష్ట్రంగా అప్పజెబితే సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రం చేశాడని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. రాష్ట్రంలో పతి ఒక్కొక్కరిపై రూ. 1,40,000 వేల వరకు అప్పు ఉందని ఆయన అన్నారు. సోమవారం నరసాపూర్ నియోజకవర్గం శివంపేట మండల పరిధిలోని గొట్టిముక్కుల గ్రామ సమీపంలో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభకు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడక ముందు ఇచ్చిన హామీలను తర్వాత మరిచిపోయారని ఆరోపించారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తే కోటి ఉద్యోగాలను ఇస్తానని ప్రధాని మోడీ ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. సీఎం కాకముందు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడు ఎకరాల ఇస్తామని చెప్పి అధికారం రాగానే వాటిని మరిచిపోయారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుతుంటుందని విమర్శించారు. పేద ప్రజలు కలవడానికి సమయం ఇవ్వని కేసీఆర్ ఇసుక మాఫియా మట్టి మాఫియా లిక్కర్ మాఫియాలు, ధనికులు కలవడానికి ప్రత్యేక సమయం ఇస్తాడని విమర్శించారు.
కూకట్పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు తో కలిసి KPHB లో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఎన్నికలకు సమయం ఆసన్నమైన వేళ ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని.. ప్రతినిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిగా గత పదిఏళ్ల నుంచి వేలకోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చామని నేడు ఎక్కడెక్కడ నుండో వచ్చి కనీసం కూకట్పల్లి నియోజకవర్గంలో ఏ గల్లి ఎక్కడ ఉంటుందో కూడా తెలియని వారు.. నియోజకవర్గ పరిది తెలియని వారు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడడం విడ్డూరంగా ఉందని.. దీనిని ప్రజలు గమనించాలని కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధి చూసి ఓటు వేయాలని అన్నారు.. నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూ అలాగే ఎంతోమంది ఉద్యోగాలు చేసుకునేవారు అన్ని మౌలిక సదుపాయాలతో సుఖసంతోషాలతో జీవిస్తున్నారని దీనంతటికీ కారణం బిఆర్ఎస్ పార్టీ తీసుకున్న విధానాలే కారణమని అన్నారు. అందుకని రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా అందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.నే డు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పిస్తున్నారని ఇదంతా మంత్రి కేటీఆర్ చొరవనేనని దీనిని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా గుర్తించాలని కోరారు. కూకట్పల్లి నియోజకవర్గంలో కేవలం పదేళ్ల కాలంలో ఎన్నో ఫ్లైఓవర్లు.. అండర్‌పాస్ బ్రిడ్జిలు నిర్మించామని ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా ప్రక్షాలించడానికి ఇంకా అనేక చర్యలు తీసుకున్నామని ఇవన్నీ కొనసాగాలంటే శాంతిభద్రతలు.. హైదరాబాద్ మహానగరంలో ఉండాలంటే కచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలని అన్నారు. అలాగే తనకు కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
శేరిలింగంపల్లి టికెట్ కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలపడ్డరు. పరిస్థితుల ప్రభవలతో జగదీశ్వర్ గౌడ్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. రఘునాథ్ యాదవ్, జైపాల్ ఇద్దరు అభ్యర్థులు పార్టీ మారకుండా మంచి మనసుతో జగదీశ్వర్ గౌడ్ కి మద్దతు ఇస్తూ ప్రచారం లో పాల్గొనడం సంతోషం కలిగిస్తుంది. శేరిలింగంపల్లి ఎమ్మేల్యే గాంధీ ఇక్కడ చేసింది ఏమీ లేదు. పేరులో గాంధీ ఉన్న చేసే పనులన్నీ దొంగ పనులు గాంధీ ఓ ద్రోహి రేపు జరగబోయే ఎన్నికల్లో శేరిలింగంపల్లి లో కాంగ్రెస్ అభ్యర్థి నే అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి. ఈ పదేళ్లు సచివాలయానికి రాని ముఖ్యమంత్రి మనకు అవసరమా..నిరుద్యోగ యువతకు ఈ ముఖ్యమంత్రి చేసింది ఏమీ లేదు. ఆయన మనవడిని మంత్రిని చేస్తే లక్కీ నంబర్ 6 ఇంట్లో మొత్తం ఆరుగురికి ఉద్యోగాలు వచ్చినట్టే అనే ఆశతో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. కేసీఆర్ కు నేను ఓ హామీ ఇస్తున్న తప్పకుండా కేసీఆర్ కు డబుల్ బెడ్ రూమ్ ఇస్తం. కేసీఆర్ బక్కొడు కాడు భూ బకాసురుడు. అది ఎక్కడో కాదు చర్లపల్లి జైల్ లో ఇస్తాం. కేసీఆర్ చేసిన అవినీతి అంత ఇంత కాదు. బిఆర్ఎస్ ను బొంద పెట్టాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి నే గెలిపించాలి. మంచి నీ బ్రతికించలి అంటే మంచి అభ్యర్థిని గెలిపించాలి. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల తో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాబోతుంది.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉన్న ప్రాంతానికి వచ్చినందుకు నేను ఎంతో అదృష్టవంతున్ని. భువనగిరి ఖిల్లను చూస్తే చాలా భాద అనిపించింది. కోటను 25కోట్లతో అభివృద్ధి చేస్తాం. తెలంగాణ లో బిజెపి అధికారంలోకి వస్తే మూసి ప్రక్షాళన చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ప్రజలే బాగుచేయలి. నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఇస్తానని కేసీఆర్ మాట తప్పారు. భూదాన్ పోచంపల్లిలో వినోదాభావే భూదాన్ ఉద్యమం చేస్తే ఇప్పుడు కేసీఆర్ భూ కబ్జా ఉద్యమం చేస్తున్నారు. కెసిఆర్ రాష్ట్రంలో వేలకోట్ల రూపాయల భూములను కబ్జా చేశాడు. బిజెపి అధికారంలోకి రాగానే కెసిఆర్ అవినీతిపై విచారణ జరిపి జైల్లో పెడతాం. తెలంగాణలో బిఆర్ఎస్ కు విఆర్ఎస్ కాలేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా విషయంలో కెసిఆర్ ఎన్నడు మోడీని కలవలేదు. కేసీఆర్ అబద్దాలను చెబుతున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కెసిఆర్ కు వేసినట్టే. 2014 ,2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లో చేరారు. ఎస్సీ వర్గీకరణకు బిజెపి ప్రభుత్వం కట్టుబడి ఉంది. బిఆర్ఎస్ సర్కార్ మిషన్ భగీరథ, మద్యం కుంభకోణాల్లో, ఓ ఆర్ ఆర్ కుంభకోణం, మిషన్ కాకతీయ, కాలేశ్వరం లాంటి కుంభకోణాలు చేశాయి. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా చేస్తాం. బిజెపి ఎమ్మెల్యేలను గెలిపిస్తే తెలంగాణను నెంబర్ వన్ గా చేస్తాం.
ఆదివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి డివిజన్లోని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు. తన సొంత గ్రామమైన కూకట్పల్లినీ నేడు అన్ని రకాలుగా ఎటువంటి సమస్యలు లేని డివిజన్ గా తీర్చిదిద్దానని ఒకప్పుడు కూకట్‌పల్లిలో ఆడపిల్లలు మంచినీళ్లు కోసం బిందులతో నిలబడి నానావస్తులు పడేవారని నేడు ఆ పరిస్థితి లేకుండా నియోజకవర్గంలోని తొమ్మిది డివిజన్లకు లక్షల్లో గ్యాలన్లతో నీటి ట్యాంకులు నిర్మించడమే కాకుండా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా భూగర్భ నీటి పైప్‌లైన్ నిర్మాణం చేపట్టామని అంతేకాకుండా పదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపారని అన్నారు. నేడు శాంతిభద్రతలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ మారిందని ప్రపంచంలో ఉన్న అతిపెద్ద కంపెనీలు హైదరాబాదులో తమ పెట్టుబడులు పెట్టి ఇక్కడున్న యువతకు అనేక ఉద్యోగాలు కల్పిస్తున్నాయని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా కూకట్‌పల్లిలోని 436 ఏళ్ల చరిత్ర గల రామాలయం పునర్నిర్మాణం ..చిత్తారమ్మ దేవాలయం.. మసీదు.. చర్చిలు అన్ని విధాలుగా అభివృద్ధి పరిచామని రాబోయే రోజుల్లో కారు గుర్తుపై ఓటు వేసి తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎన్నుకుందామని తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కేసిఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా కావాలని మంత్రి హరీష్ రావు సతిమని శ్రీనిత పిలుపునిచ్చారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అంచలంచలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాబోయే రోజుల్లో తప్పకుండా వస్తాయని ఆమె తెలిపారు. సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీష్ రావు కు మద్దతుగా పలు వార్డులలో హరీష్ రావు సతీమణి తిరిగి ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచార సందర్భంగా పట్టణంలో హరీష్ రావు సతీమణికి భారీ స్పందన లభించింది.
సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి సేవకుడు చింత ప్రభాకర్ కి మా మద్దతుతని జిల్లా వీరశైవ లింగాయత్ మాజీ అధ్యక్షులు ఏ సిద్దేశ్వర్, జిల్లా గౌరవ అధ్యక్షులు శివచంద్ర పాటిల్ అన్నారు. వీరశైవ లింగాయత్ సమాజం తరఫున శనివారం విలేకరుల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. వీరశైవ లింగాయత్ అభివృద్ధి కోసం చింత ప్రభాకర్ పట్టణంలోని బసవ సేవా సదన్ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం కృషి 50 లక్షలు నిధులు ఇవ్వడం జరిగిందని ఎడ్ల బజార్ బసవేశ్వర కళ్యాణ మండపానికి 40 లక్షల రూపాలు రావడానికి కృషి చేసిన చింత ప్రభాకర్ కే మా ఓటు అని తీర్మానం చేశామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాష్ట్ర వీర సేవా సమాజం భవనం కోసం కోక పేటలో కోట్ల విలువ చేసే ఎకరం స్థలం ఇవ్వడం జరిగిందని జిల్లా సమాజ భవనం కోసం కంది మండలంలో సుమారు ఐదు కోట్ల విలువ స్థలాన్ని కేటాయించడం జరిగిందని, అదేవిధంగా కేసీఆర్ బసవ జయంతిని అధికారికంగా నిర్వహించడం హర్షినియమన్నారు. నియోజకవర్గంలోని వీరశైవులందరూ చింత ప్రభాకర్ గెలుపు కోసం కృషి చేయాలని సమాజం తరఫున పిలుపునిచ్చారు. సమావేశంలో సమాజం జిల్లా కోశాధికారి చంద్ర కాంత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పపల్లి నర్సింలు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆత్మకూరు నాగేష్, జిల్లా నాయకులు మల్లికార్జున్ గందిగేరాజు శాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు (శనివారం) వేములవాడ దద్దరిల్లనుంది. BJP అభ్యర్థి చెన్నమనేని వికాస్‌రావుకు మద్దతుగా 11AMకు సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రానున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కు మద్దతుగా 2PMకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ సభ జరగనుంది. మరుసటి రోజు (26న) BRS అభ్యర్థి చల్మెడకు మద్దతుగా KCR ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది.






Total views : 147308