ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. పోలింగ్ అనంతరం ఈవిఎం యంత్రాల తరలింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జిల్లాలలో పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శివలింగయ్య అన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, ఈవిఎం యంత్రాల తరలింపు, కౌంటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్ లకు పలు సూచనలు చేశారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు, యువత, దివ్యాంగులను పోలింగ్ లో భాగస్వామ్యం చేసేలా, చర్యలు తీసుకోవాలని, మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రచార సమయం జిల్లాలోని నియోజకవర్గల్లో నవంబర్ 28 సాయంత్రం 5 గంటలకు, ప్రచారం ముగుస్తుందని, అనంతరం 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ పాటించాల్సి ఉంటుందని అన్నారు. పోలింగ్ నిర్వహణకు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని, విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు కల్పించాలని అన్నారు. పోలింగ్ అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ కు ఈ.వి.ఎం. యంత్రాల తరలింపు కోసం అవసరమైన వాహనాలను సిద్ధం వున్నాయి అన్నారు. జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రిటర్నింగ్ అధికారి పాలకుర్తి), రోహిత్ సింగ్, ఉప ఎన్నికల అధికారిని సుహాసిని, జనగామ, స్టేషన్ ఘన్పూర్, రిటర్నింగ్ అధికారి, మురళీకృష్ణ, రామ్మూర్తి, ఎన్నికల నోడల్ అధికారులు ఇస్మాయిల్, వినోద్ కుమార్, అనిల్ కుమార్, ఆధికారులు పాల్గొన్నారు..
మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు…
56
previous post